Article Abstract
International Journal of Trends in Emerging Research and Development, 2024;2(6):301-306
డైనమిక్ లిటరరీ కమ్యూనిటీలు నేటి అవసరం
Author : డా.బెల్లి యాదయ్య
Abstract
'ఆధిపత్యం (Dominance)' మీద 'గెలుపు (Victory)' అనుకున్నంత సులువేంకాదు. ఎందుకంటే ఆధిపత్యానికి అండగా రాజ్యాలు ఉంటాయి. పెట్టుబడి,పలుకుబడి దానికి తోబుట్టువులు, అవినీతి అక్రమార్జన బంధువులు. ఆధిపత్యం ఎన్ని విధాలుగా మానవాళిని ఏలుతూ వచ్చిందో, వంచిస్తూ ఉందో తెలియాలంటే గతంలోకి వెళ్లాలి. గతం అంటే ఇవాళ్టి నుండి వెనక్కి దశాబ్దాలు శతాబ్దాలు వెళ్లాలి. వర్ణాధిపత్యం ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. వర్ణ వ్యతిరేక ఉద్యమాలు రాజుకోగానే ఆధిపత్యశక్తులు ఆయుధాలతో ముందుకొచ్చాయి. బుద్ధుణ్ణి ధ్యానిస్తూ గాంధీజీని అనుసరిస్తూ ప్రపంచ ప్రజలు శాంతి అహింసలతో చుట్టుముట్టగానే ఆధిపత్యశక్తులు తమ రూపాన్ని అత్యంత చాకచక్యంగా మార్చుకొని ఆర్థిక రంగాన్ని చెప్పుచేతుల్లోకి తీసుకున్నాయి.ఆర్థికాధిపత్యం ఇప్పుడు శ్రుతిమించి వికృతంగా కోర విచ్చింది.అయితే, ప్రపంచీకరణ ఎంత దుర్మార్గమైందైనా దానికో సుగుణం ఉంది.నాలెడ్జిని నైపుణ్యాలను వ్యాపారార్థమే కావొచ్చు ఎంచక్కా తలకెత్తుకుంటుంది.కులం మతం ప్రాంతం వీటన్నిటికీ అతీతంగా సరుకుగల మెదళ్లను సంతలో ఎంత మొత్తానికైనా కొనుగోలు చేస్తుంది.అట్లా ఆర్థికంగా బలహీన దేశాలు తమ మేధాశక్తితో నిలదొక్కుకుంటు న్నాయని అనుకుంటుండగానే సాంస్కృతిక ఆధిపత్యంతో ఆధిపత్య శక్తులు మోహరించాయి.అధికార,ఆర్థిక, ఆయుధ స్వామ్యాల ముప్పేట దాడికి ఎదురునిలవడానికి చేష్టలుడిగి బలహీన దేశాల సాంస్కృతిక వారసత్వం ప్రమాదంలో పడింది. అందుకనే వర్తమానాన్ని సామాజిక వేత్తలు' సాంస్కృతిక వారసత్వం ప్రమాదంలో పడిన యుగం' గా అభివర్ణించారు.సూటిగా చెప్పాలంటే మనం సాంస్కృతిక వారసత్వం ప్రమాదంలో పడిన యుగంలో జీవిస్తున్నాం. మరిప్పుడు దారీతెన్నూ ఏదీ లేదా అంటే, ఎందుకు లేదు? ఉంది, ఒక చేవగలిగిన మార్గం ఉంది, ఒక సారభూతమైన ఉపకరణం ఉంది.ఏమిటా చేవగలిగిన మార్గం, సారభూతమైన ఉపకరణం అంటే, మన సాహిత్య సంస్థలు లేదా సాంస్కృతిక సంస్థలు ప్రోదిచేసే చైతన్యం, చాటే పరిమళాలు.
Keywords
డైనమిక్ లిటరరీ కమ్యూనిటీలు నేటి అవసరం