Browse Categories

Article Abstract

International Journal of Trends in Emerging Research and Development, 2025;3(2):123-124

నైపుణ్యాధారిత కోర్సులు ప్రవేశపెట్టాలి

Author : డా. బెల్లి యాదయ్య

Abstract

కాలాన్ని సెకన్లు,నిమిషాలు, గంటల వ్యవధి, పరిమాణం ఆధారంగా రోజులు,వారాలు నెలలు, సంవత్సరాలు, దశాబ్ది,శతాబ్ది,సహస్రాబ్దిగా గణిస్తాం.ఈ భౌతిక రూపంతోపాటు కాలానికి ప్రకృతి వర్తింపజేసే బౌద్ధిక రూపం ఉంది. ఋతువులే కాలానికి బౌద్ధిక రూపం. అయితే, కాలానికి మనుషులు ఆలోచనలు,మేధస్సు, ఆవిష్కరణలతో కల్పించే మరో బౌద్ధిక రూపం ఉంటుంది.దీనికే పరిస్థితులు అని పేరు.ఈ పరిస్థితులను మళ్లీ సామాజిక రాజకీయ ఆర్థిక శాస్త్రసాంకేతిక సాంస్కృతిక రంగాల్లో చోటుచేసుకున్న మార్పులుగా చెప్పుకోవచ్చు.అంటే కాలానికి ఒక భౌతిక రూపం, రెండు బౌద్ధిక రూపాలుంటాయి. బౌద్ధిక రూపంలో రెండోదైన పరిస్థితులనే ఆంత్రోపాలజిస్టులు అసలైన కాలంగా నిర్వచించారు. అభిజ్ఞా ప్రక్రియలు, పర్యావరణ మార్పులతో సంబంధం ఉన్న ఉద్దీపనల మొత్తం ద్వారానే కాలం అవగాహన కాగలదని న్యూరోసైన్సు చెబుతుంది. కాలానికి సామాజిక ప్రాముఖ్యత ఎంతో ఉంది, ఆర్థిక విలువ, వ్యక్తిగత విలువ కాలానికి ఉన్నాయి.ఈ ఎరుక మూలంగానే కాలంతోపాటే అందరూ మారాల్సుందన్నారు పెద్దలు. మారని పక్షంలో ఎక్కడున్న వాళ్లు అట్లనే అక్కడే ఉంటారు. వెనుకబడి పోతరు. వ్యక్తిత్వ వికాస విద్యలో వెనుకబడి పోవడం ఫెయిల్యూర్ కింద లెక్క. కాలంతోపాటు మారుతూ సాగిపోతూ వుండటం గెలుపుదిశగా ప్రయాణిస్తున్నట్టు. వ్యవసాయ యుగపు సంప్రదాయ పరిభాషలో చెప్పాలంటే ఏదైనా వృత్తి చేస్తూ భూములు డబ్బు సంపాదించిన వాళ్లను స్థితిమంతులు, ఐశ్వర్యవంతులు, సంపన్నులు,కలిగినోళ్లు అంటం. ఇప్పుడు స్థితిమంతులు, ఐశ్వర్యవంతులు, సంపన్నులు,కలిగినోళ్లు ఈ మాటలన్నీ వాడుక తప్పాయి. వీటి స్థానంలో సక్సెస్ ఫుల్ పర్సన్స్, విన్నర్స్, విజేతలు అనే మాటలు స్థిరపడ్డాయి. వెనుకట వ్యక్తులు కుటుంబాలు జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి కమ్యూనిటీ మద్దతు,సాంప్రదాయ వనరులు జ్ఞానం ప్రతిభ, ఆధ్యాత్మిక విశ్వాసాలు నైతిక స్వభావం వగైరా ఆధారభూతంగా ఉండేవి. ఇప్పుడంతా డిఫరెంట్. నైపుణ్య సముదాయం( స్కిల్ సెట్) ఉంటే జీరోనుంచి మొదలై వ్యక్తులు తాము అనుకున్న రంగాల్లో వంద పాయింట్లకు సమున్నతంగా ఎదగవచ్చు.

Keywords

నైపుణ్యాధారిత కోర్సులు ప్రవేశపెట్టాలి